‘ఆచార్య’లో అదిరే స్టెప్పులు వేయనున్న మెగాస్టార్‌ “చిరంజీవి” తో మిల్కీబ్యూటీ “తమన్నా”.. :Acharya

0
122
Tamanna Item Song in Chiranjeevi 150th Movie

మిల్కీ బ్యూటీ తమన్నా యాక్టింగ్ సంగతి పక్కన పెడితే.. ఆమె డాన్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన సినిమాల్లో హీరోలను సైతం తన డాన్స్‌తో డామినేట్ చేసే మిల్కీబ్యూటీ మెగాస్టార్‌తో స్టెప్పేసేందుకు రెడీ అయ్యింది.

చిరంజీవి, తమన్నాచిరంజీవి, తమన్నామెగాస్టార్ చిరంజీవి-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరొందిన కొరటాల మెగాస్టార్‌ను తొలిసారి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కొరటాల సైతం తన మార్క్‌కి తగ్గట్టుగా ఈ చిత్రంలో చిరంజీవి రెండు విభిన్నపాత్రల్లో చూపించబోతున్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తి చేసే పోరాటంగా సాగుతుందని ఆచార్య కథను పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు కొరటాల. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి మెలోడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ – మణిశర్మ కాంబో.. సుమారు 12 ఏళ్ల తరువాత తిరిగి ‘ఆచార్య’తో కలిసి పనిచేస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం మణిశర్మ ఐదు పాటలను సిద్ధం చేయగా.. ఇందులో ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ఉందట. ఇందుకోసం మిల్కీ బ్యూటీ తమన్నాను రంగంలోకి దింపుతున్నారట దర్శకుడు కొరటాల. సైరా చిత్రంలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న తమన్నా.. మరోసారి ఆయనతో కలిసి ఆడిపాడనుందట. ఇక రెజీనా సైతం ఒక ప్రత్యేక పాటలో కనిపించనుందని వార్తలు వచ్చాయి. అయితే రెజీనా ప్లేస్‌లో తమన్నాను తీసుకున్నారా?? లేక ఇద్దరు బ్యూటీలకు రెండు స్పెషల్ సాంగ్స్ ఇచ్చారా? అన్నదానిపై క్లారిటీ రావాల్సిఉంది.

ఇక చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తోంది. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’లో ఆడిపాడిన కాజల్.. మరోసారి మెగాస్టార్‌తో జోడీ కట్టే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. మొదటిగా ఈ సినిమాకి త్రిషను హీరోయిన్‌గా ఎంపిక చేయగా.. ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ‘ఆచార్య’ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.