కరోనావైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎట్లా గుర్తించాలి? నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలి ?

0
205
COVID-19 Symptom | Coronavirus Symptoms | కరోనావైరస్ జాగ్రత్తలు

కరోనా వైరస్‌ సోకినవారిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయని, వాటిని గుర్తించగగానే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆ లక్షణాలేంటి?

  • ఆగకుండా దగ్గురావడం, గంటల తరబడి దగ్గు కొనసాగడం, 24 గంటల్లో అలాంటి పరిస్థితులు రెండు మూడుసార్లు ఏర్పడటం
  • జ్వరం విపరీతంగా ఉండటం, 100 డిగ్రీల ఫారన్‌ హీట్‌లను దాటడం
  • వాసన గుర్తించలేకపోవడం.

ఇవీ ఈ వైరస్‌ సోకిన వారిలో కనిపించే ప్రధానమైన లక్షణాలు.

ఈ లక్షణాలున్న వారు మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఉన్నారంటే వెంటనే వారిని దూరంగా ఉండమని సలహా ఇవ్వాలి.

చలిగా ఉండటం, తరచూ వణికడం, ఒళ్లు నొప్పులు కూడా ఈ వైరస్‌ సోకినవారిలో కనిపించే లక్షణాలుగా గుర్తించారు నిపుణులు.

వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ లక్షణాలు కనిపించడానికి కనీసం ఐదురోజుల సమయం పడుతుంది. మరికొందరికి ఇంకా ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు. ఈ వైరస్‌ 14 రోజుల వరకు శరీరంలో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

కరోనా వైరస్ లక్షణాలు

కొద్దిపాటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

కరోనా లక్షణాలు కనిపించినంత మాత్రాన కంగారు పడి ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేదని ఇంట్లోనే ఉంటూ క్వారంటైన్‌ కావడం ప్రధానమైన చర్యగా చెబుతోంది ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)

ఐసీఎంఆర్‌ విడుదల చేసిన సూచనల ఆధారంగా వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖలు ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్లకు సూచనలు చేస్తున్నాయి. కరోనా లక్షణాలుగా కనిపించిన వెంటనే ఇంట్లో తగినంత స్థలం ఉన్నవారు హోమ్‌ క్వారంటైన్‌ కావాలని ఐసీఎంఆర్‌ సూచించింది.for more information on ICMR Guidelines Watch this video https://youtu.be/RWy-GNUBoIk

కొద్దిపాటి జ్వరం, ఒళ్లు, నొప్పులులాంటి లక్షణాలున్నవారు నొప్పులను, జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్‌లాంటి మాత్రలు వాడి ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా వైరస్ జ్వరాన్ని, శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడం ఎలా

ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి?

తట్టుకోలేని జ్వరం, దగ్గుతో ప్రధానంగా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడేవారు మాత్రమే ఆసుపత్రికి రావాలని సూచించింది ఐసీఎంఆర్‌.

ఊపిరితిత్తులు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో పరిశీలించి ఆక్సిజన్‌ లేదా వెంటిలేటర్‌ సాయంతో డాక్టర్లు వైద్యం అందిస్తారు.

వైరస్‌ వల్ల ఏర్పడ్డ ఆరోగ్య సమస్యలు రోజువారి పనులు చేసుకోలేనంత ఇబ్బందిగా మారినప్పుడు కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌ నంబర్లు (కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం – 1075,01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – 104)కు కాల్ చేయాలి. లేదంటే సమీపంలోని ఆరోగ్యకార్యకర్తలకు పరిస్థితి వివరించి తక్షణం చికిత్స పొందాలి.