చైనా సరిహద్దుల్లో రాత్రి వేళల్లో కూడా భారత వాయుసేన విన్యాసాలు…..

0
197

India gets its first Apache Guardian attack helicopter in US. See ...

భారత్, చైనా సరిహద్దు వద్ద అర్ధరాత్రి వేళ భారత వాయుసేన విన్యాసాలు జరిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. సరిహద్దులోని ఎయిర్ బేస్‌లో ఐఏఎఫ్‌కు చెందిన మిగ్-29 యుద్ధ విమానాలు, దాడి చేయగల సామర్థ్యమున్న అపాచీ హెలీకాప్టర్లు, అధిక బరువులను మోయగల చినూక్ హెలీకాప్టర్లు ఈ నైట్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

 

కాగా, భారత వాయుసేన సన్నద్ధతను పరీక్షించేందుకు ఇలాంటి, నైట్ ఆపరేషన్లు ఆశ్చర్యం కలిగిస్తాయని ఇందులో పాల్గొన్న గ్రూప్ కెప్టెన్ ఏ రతి తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్తా చాటేందుకు వాయుసేనకు చెందిన సుశిక్షులైన సిబ్బంది ఎప్పుడూ సిద్ధమేనని ఆయన చెప్పారు. లఢక్‌ సరిహద్దులో చైనాతో ఇటీవల ఘర్షణ జరిగిన నేపథ్యంలో భారత వాయుసేన రాత్రివేళ ఆపరేషన్స్ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.