మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ …. 

0
275

అరేయి పైసల్ ఇవ్వన సినిమా కి పోతారా …!!

ఎక్కడో విన్నట్టు ఉంది కదా ….మీరు ఇది చదువుతున్నారంటే పక్క మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది , ఇది అర్జున్ రెడ్డి సినిమా లోని డైలాగ్ !!

సినిమా ఏదైనా స్టోరీ ఏదైనా కానీ ఒక అబ్బాయి లైఫ్ మాత్రం అంత సులువు కాదు, ఎదో అనుకుంటే ఎదో అవుతుంది. ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితం లో చాలా సర్దుకు పోవాల్సి వస్తుంది. చేయాలనుకున్నవి చేయలేదు ఎందుకంటే అంత ధైర్యం ఉన్న తనని ఎదో ఆపుతుంది అదే పరువు వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఇలా చేస్తే పరువు పోతుందేమో అని ఒక చిన్న భయం . ఆ భయాన్ని దాటి ముందుకు అస్సలే వెళ్ళలేరు . 

ఈ కింద ఉన్న ఇమేజ్ చూడండి ఎరుపురంగులో ఉన్న యారో లు మన జీవితంలో చాలా ఉంటాయి, అమ్మ నాన్న ల ప్రేమ, ఉద్యోగంలేకపోవడం, ధైర్యం లేక పోవడం, బాగా పైసలు లేకపోవడం….ఇలాంటి వి మనల్ని మన జీవితంలో నిరాశ పరిచే విషయాలు ఇవి మనం అనుకున్నదిచేయడానికి ఎప్పుడు అడ్డు వస్తూనే ఉంటాయి జీవితకాలం.

middleclassabbayi

కాబట్టి మీరు అనుకున్నది చేయాలంటే ముందు ధైర్యంకావాలి మీరుచేసే పనిమీద మీకు నమ్మకం ఉండాలి!!

కొంత మంది ప్రేమ లో ఓడిపోతే అదేదో జీవితం మొత్తం అయిపోయినట్టు అనుకోని వాళ్ళజీవితాన్ని వాళ్ళే అంతం చేసుకుంటారు దయచేసి ఆలా చేయకండి!!!

జీవితం మనకి  ఎప్పుడైనా పాఠాలు నేర్పుతూ ఉంటుంది నేర్చుకుంటూ ముందుకు సాగాలి అంతే!!

 

మీరు మీకుటుంభం ఎప్పుడు సంతోషం గా ఉండాలని ఆశిస్తూ మీ స్నేహితుడు!!