Present Situation Marriage Tensions/ఇప్పుడున్న పరిస్ధితుల వల్ల పెళ్లిళ్లు అయితాయా ?

0
116

అందరిది ఒక భాద అయితే, ఇప్పుడు పెళ్లి ఈడుకొచ్చిన పిల్లలది వాళ్ళ తల్లి తండ్రులది ఒక భాద!!

పెళ్లి అవుతదా కాదా ? ఒకవేళ కుదిరితే ఎంతమంది వస్తారు అసలు? చేసుకోవాలా వద్దా ? ఇప్పుడు సంబంధాలు చూడాలా వద్దా ? వీటన్నిటికీ ఒక్కటే సమాధానం మనం కొంచెం ఓపిక తో వేచి చూడాలి తప్పదు.

కానీ ఇంట్లో కూర్చొని పిల్లల పెళ్లి గురించి ఆలోచించకుండా ఉండటం అంత తేలిక కాదు కనుక ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గట్టు ఆన్ లైన్లో పెళ్లి చూపులు బెటర్ ! పెళ్లి మాత్రం చాలా తక్కువ చుట్టాలతో చేసుకోవడం మంచిది, లేదంటే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి తరువాత పెట్టుకోవచ్చు !! ఇవన్నీ ఒకవేళ పెళ్లి కుదిరితేనే …..

ఒకవేళ కుదరకపోతే మాత్రం కరోనా కొంచెం తగ్గుముఖం పట్టిందాకా వేచి చూసి తరువాత చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడు సంబంధాలు వెతకడం దగ్గరనుండి ప్రతిఒక్కటి చాలా కష్టం , మాములు సమయం లో మనకి మన చుట్టాలు ప్రతిఒక్కదాంట్లో సహాయం చేస్తారు ఇప్పుడు ఆలా కాదు మనమే దాదాపు అన్ని దగ్గరుండి చూసుకోవాలి , ఇలా చేస్తే మనకి లేనిపోని ఆలోచనలు ఏది మంచో ఏది చెడో తెలియకుండా ముందుకెళ్లడం అంత మంచిది కాదు.

పిల్లలు కూడా ఓపికతో ఉంది తల్లి తండ్రులకు సహకరించాలి అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లలని తొందర పెట్టొద్దు అనవసరంగా టెన్షన్ పడొద్దు !!

ప్రశాంతంగా కరోనా తగ్గాక పెళ్లి చేసుకోవడం , ఆరోగ్యానికి మరియు మీ భవిష్యత్తుకి రెండిటికి మంచిది !!

ఇట్లు మీ శ్రేయోభిలాషి !!!!

మీ స్నేహితులకి షేర్ చేయడం మరువకండి కుదిరితే వాళ్ళ పేరెంట్స్ కి కూడా పంపండి !!